Monday, August 24, 2009

వేళాకోళం

కందిపప్పు వంద దాటింది మిగిలినవీ అంతే. బియ్యం రోజు రోజుకీ పెరుగుతోంది.ధరల సూచీ మాత్రం తగ్గి తగ్గి నెగెటివ్ అయిందట! వేళాకోళమా? ఈ సాకుతో పాపం ప్రభుత్యోద్యోగులకి ఇచ్చే డియ్యే యెగ్గొడ్తారు.[నేను ప్రభుత్వోద్యోగిని కాను]
ఈ అర్ధిక శాస్త్రవేత్తలనీ స్టాటిస్టీషియన్లనీ ప్రజలు చొక్కా పుచ్చుకుని నిలదీసే రోజు ఇంకా రాలేదా. ఈ దేశంలో చదువుకున్న వాళ్ళూ సైంటిస్టులూ జ్ఞానులమని చెప్పుకునే వాళ్ళూ
చేస్తున్న మోసాలు ఇన్నీ అన్నీ కావు. ఈ సంవత్సరం 101 శాతం వర్షాలు పడతాయని మేలో చెప్పిన వాణ్ణి కొరడా పట్టుకుని కొట్టద్దా? మళ్ళీ ఆ నోటితోనే జూన్ లో 50 శాతం అని మార్చేడు.
ఒక్కొక్క వ్యక్తి సమస్త శక్తీ ధారపోసి వీళ్ళ తాటలు వొలవాలి.

2 comments:

  1. ఈ 50 శాతం ఏంటో నాకర్ధం కాదు. బహుశా "పడితే పడతాయ్ లేక పోతేలేదు. నాకు మాత్రం తెలీదు" అనికావచ్చు.

    ReplyDelete
  2. వాతావరణం శాఖవారి ప్రకటనలు పెద్ద ప్రహసనంగా మారాయి.ప్రభుత్వాలకు తగినట్లుగా ఉంటున్నాయి వారి అంచనాలు.

    ReplyDelete