Saturday, August 15, 2009

ఛెత్రపతి

నాకు నిన్న నిజంగా భయమేసింది. నిన్న సాయంకాలం టీ వీ లో చత్రపతి అనే దరిద్రగొట్టు సినిమా వచ్చింది.సెలవులకి వచ్చిన మా ఆరేళ్ళ మనమడి బలవంతం మీద చచ్చినట్టూఉ ట్యూన్ చేశాను. ఆ సినిమాలో ఒక కొడుకు తన అన్నకి తల్లి ప్రేమ తనకన్నా యెక్కువ దక్కకూడదని యెంతో కసి తో వుంటాడు.వాడు కోపం ప్రదర్శించే దృశ్యాలు అన్నమీద చూపించే కసి మా వాడు యేంత శ్రధ్ధగా చూస్తున్నాడో గమనించాక నాకు నిజంగా భయం వేసింది.మాటలలో పెట్టి ఛానెల్ మార్చాననుకోండి..అయినా ఇలాటి సినిమాలా. మామూలు వయొలెన్స్ అయినా కొంత పరవా లేదు.పెర్సనల్ గా రిలేట్ అవవు.కాని ఇదేమిటి.

1 comment:

  1. ఈ సినిమాకు అడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు చూసే సినిమా కాదు. టీవీవాళ్ళు కూడా "పెద్దలకు మాత్రమే" నోటీస్ ఇచ్చేలా చూడాలనుకుంటాను.

    ReplyDelete