Friday, August 7, 2009

యేం పిల్లడో

మగధీర వివాదం సమాజంలో నిండిన అసహనానికీ కీర్తి కాంక్షకీ అద్దం పడుతోంది. యెప్పట్నించో శ్రికాకుళం పల్లె ప్రజలు వలస పోతూ పాడుకున్న పాటల పల్లవిని వాడుకుని అంతో ఇంతో పేరు తెచ్చుకున్న మనిషి ఇప్పుడు అది తన సొత్తేననడం హిపోక్రసీ కాక మరేమిటి. ప్రజల సొత్తు అని గొంతు చిచుకునే వాళ్ళకి ఇప్పుడు ఆ పాటని సినిమాలో ఆదరిస్తున్న కుర్రకారు ప్రజల్లా కనిపించరా! ఈ ప్రజా సంఘాలకున్న రోగమే అది. వాళ్ళూ వాళ్ళు చెప్పిన వాళ్ళూ తప్ప మిగిలిన వాళ్ళు ప్రజలూ కారు వాళ్ళకి సివిల్ లిబర్టీలూ వుండవు.జానపద గీతాన్ని సినిమాలో వాడడమంటే అది అనాదిగా వస్తున్నదే.మొక్కజొన్న తోటలో కాని కాంభోజరాజు కధ తీసినప్పుడుగాని .సినిమా వాళ్ళ హిపోక్రసీ అంటే అది మరోకధ.యెవరు హిపోక్రాట్లు కాదు? ఒక సంగతి గుర్తుంచుకోవాలి.విప్లవ గీతాలు రాసిన వాళ్ళందరూ శ్రీశ్రీ లు కారు..ప్రణయగీతాలు రాసిన వాళ్ళందరూ కృష్ణశాస్త్రులు కారు...జానపదగీతాలు పాడిన వాళ్ళందరూ సీతా అనసూయలూ గద్దర్లూ కారు.
కొస మెరుపు: ఇప్పుడు మా టీవీ సూపర్ సింగర్ లో జానపద గేయాలు పాడి కాష్ బహుమతులు పొంది అమెరికాలు వెళ్ళి నేడో రేపో సినిమాల్లో పాడేవాళ్ళని యేమనాలి

3 comments:

  1. బూతు పాటల్లో హిందూ దేవుళ్ళ పేర్లు వాడితే హిందువులు ఊరుకుంటారా? ముహమ్మద్, జీసస్ ల పేర్లు వాడితే ముస్లింలు, క్రైస్తవులు ఊరుకుంటారా? మరి విప్లవ పాటల నుంచి సేకరించిన వచనాలని బూతు పాటల్లో పెడితే విప్లవకారులు ఎలా ఊరుకుంటారు? ఆ మధ్య సాక్షి పేపర్ లో ఏసు క్రీస్తు సిగరెట్ తాగుతూ మందు కొడుతున్నట్టు ఫొటో వేస్తే క్రైస్తవులు ఏమి చేశారో తెలియదా?

    ReplyDelete
  2. వంగపండు ఒక ముసలి నక్క. ఏం పిల్లడో అన్న పల్లవిని వాడుకోవటం ఏమాత్రం తప్పుకాదు. అదేమైనా వేద మంత్రమా? లేక త్యాగయ్య కృతా? వంగపందు వ్రాసిన తొక్కలో పాటకు అంత సీన్ లేదు. అయితే ఒక మాట. అతనికి కొంత డబ్బు ముట్టజెబితే సరిపోతుంది.

    ReplyDelete
  3. ఈ విప్లవకారులతో వచ్చిన చిక్కే ఇది. వాళ్ళేదో ఒక వేరే క్లాస్ అనుకుంటారు. ప్రజలూ విప్లవకారులూ ఒకటే కాక పోవడంవల్లే విప్లవాలు అడవుల్లోనూ కాగితాలమీదా వుండిపోతున్నాయని యెప్పుడు గుర్తిస్తారు? తెలంగాణా విప్లవం గురించి చదవండి.

    ReplyDelete