Monday, May 23, 2011

choti choti baatein

పొద్దున్నే లేచి టీవీ ఆన్ చేస్తే ఆనంద్ పాటలు వస్తున్నాయి.ఛోటీ ఛోటీ బాతోంకి హై యాదే బడీ.
ఎన్ని జ్జ్ఞాపకాలు...
అమ్మమ్మ పెట్టిన పెసర ఆవకాయ... అమ్మ చేసిన దొండకాయవేపుడు...కిర్లంపూడి హాస్టల్లో చేమ ఫ్రై.... నాభార్య చేసే వంకాయ పుల్లబజ్జి...
ప్రేమ్ జిత్ లాల్ తోకలిసి 60పైసల టిక్కట్ తో దిల్ తేరా దివానా చూడడం..
ఆషుతో కలిసి సైకిల్ మీద పబ్లిక్ గార్డెన్ కి వెళ్ళిన రోజులు,
పెదనాన్న గారితో రిక్షా మీద వెళ్ళి చార్ మినార్ దగ్గిర ఐస్ తేవడం..
ఆబూ అబ్రహామ్ తో కలిసి పార్క్ ( అప్పట్లో సన్ ఎన్ సీ) హోటల్ నించి వడిచి వచ్చి ఆంధ్రా యూనివర్సిటీ ఔట్ గేట్ వద్ద మసాలా వడలు తినడం..
నా భార్యతోకలిసి హనీమూన్ లో బేలూరు చూడడం..
మా అబ్బాయిల బాల్యం...
ఆఖరి బంతిలో జావేద్ మియాందాద్ 6కొడితే ముఖాలు వేలాడేసిన నా పిల్లల్ని ఓదార్చడం..
తాతా అని వాటేసుకునే రోహన్. తాతీ అని డాన్సుచేసే రోహిత్,
రిచాస్ తాత అని మీద వాలే రిచా..
తాతాఆఆఆఆ అని అరిచే రియా..
మొన్న పార్కులో నాటిన మొక్క నిన్న వాకింగ్ కి వెళ్ళినప్పుడు పూసి పలకరించడం.....జీవితం నవ్వుల నజరానా

Sunday, July 18, 2010

అల్లీబిల్లీలోకం

నిన్నటి పోస్టులో ఆలిస్ గురించి రాశాను.కళ్ళు మూస్తే ఆఠీనురాణీ సయమీస్ కాటూ పిచ్చి కుందేలూ కాకీ అందరూ కనిపిస్తున్నారు.

కలలోబతుకుతున్నామా బతుకులోనే కల గంటున్నామా

Saturday, July 17, 2010

ఆలిస్ ఇన్ వండర్లాండ్

నిన్న ఒకసారి గట్టిగా గిల్లిచూసుకున్నాను-కలా నిజమా అని.చంద్రబాబేమిటి? పరివారసమేతంగా కంచెలు దూకడమేమిటి?వారిని అరెస్టు చేసి కటికనేలపై తిండీతిప్పలూ లేకుండా వుంచడమేమిటి?అది చూసి రోశయ్యగారూ పరివారమూ ముసిముసీనవ్వులు(మనకి తెలీదా ఏమిటి?) నవ్వుకోడమేమిటి?హుందా అనేదేమైంది? నాయుడు అంతగా బాబ్లీ గురించే పోరాడాలంటే ముంబాయి వెళ్ళి వారి సి ఎం తో మాట్లాడలేడా?నాయుడికీ రోశయ్య సర్కారుకీ మహారాష్ట్ర సర్కారుకీ ఇంగితజ్ఞానం పోయిందా లేకపోతే ఇలాంటి కేతిగాళ్ళని నేతలనుకుంటున్న మనకే పోయిందా?

Friday, July 9, 2010

గురివింద

రాజీవ్గ్ గాంధీ అండ లేకుండా వైఎస్ఆర్ అంతవాఢయ్యాడా అని సోనియా వాపోయారట. మరి తమసంగతేమిటో

27 మే నాడు జవహర్ లాలు గారిని తలచిన దాఖలా కనబడలేదే

Sunday, July 4, 2010

హతవిధీ

ఇప్పుడే చూశాను ఒక ఛానెల్ వారు తెలంగాణ పంచాయితీ జరుపుతుంటే గులాబికండువా వారు స్టేజెక్కి గలాభాచేస్తున్నారు.విజయశాంతిగారికి మనుషులని నరికెయ్యడంలో తప్పేమీకనబడలేదట. పైగా కాళోజీ గారన్నమాటే అన్నారట. రేపు మరొకావిడ కంటినీరు చనుకట్టుమీద పడడం చూపించి పోతనగారు చెప్పిందే అంటుందేమో

Tuesday, February 9, 2010

సమర్ధమైన ప్రభుత్వం లేకపోతే ఎన్ని చిక్కులొస్తాయో గత ఆరునెల్లగా ప్రజలకితేటతెల్లమౌతోంది.ప్రజలమధ్యనించి వచ్చే నాయకులు కాకుండా అధిష్ఠానం(ఎవరికి?) కూచోబెట్టిన వాళ్ళు యేలితే కుక్కలు చింపిన విస్తరి అవుతుంది.నేను సొంతంగా యేమీ చెయ్యను పైవాళ్ళెలాచెపితే అది పాటించడమే అన్న ముఖ్యమంత్రిని తెలివితక్కువ వాడనుకోవాలా దగుల్బాజీ అనుకోవాలా? క్షమించాలి కే సి ఆర్ గారి భాష వచ్చేస్తోంది. బయట పడాలంటే మంచిమాటలేమైనా ఆడుకోవాలి.
మొన్నొక రోజు జీటీవీ సరిగమప చూశాను. కోడి రామకృష్ణ అతిధిగా వచ్చేడు. తూర్పు పడమర లోని శివరంజనీ పాటని ఒక కుర్రాడు పాడాక దానిని శివరంజని సినిమాలోదిగా అభివర్ణించి యేవేవో చెప్పాడు. ఆమాటలన్నీ కట్టుకధలే అనుకోవాలా.. శైలజకీ మాధవపెద్ది సురేష్ కీ కూడా తెలీదా లైవ్ ప్రోగ్రాం కాదే సరిదిద్దలేదెందుకని?

Saturday, October 31, 2009

తాగిన వాడి నోట

తాగిన వాడి నోట నిజాలే వస్తాయంటారు.కే సి ఆర్ గారు మాత్రం తాగడం మానేశాక చాలా నిజాలు చెప్తున్నారు. లుచ్ఛాలు లఫంగులు ఇత్యాదులు. నిజానికి నేటి రాజకీయ నాయకులున్న ఏ ఫొటోని చూసినా రోగ్స్ గాలరీ లాగే వుంటుంది. కేసీఆర్ కూడా అందులోనివాడే అన్నది మనకీ తెలుసనుకోండి. అయితే బాధాకరమైనదేమిటంటే ఇదే తెలంగాణా ప్రజల భాష అని ఆయన దబాయిస్తున్నారు. నాకు తెలంగాణా మిత్రులెంతమందో వున్నారు. లబ్ధప్రతిష్ఠులైన తెలంగాణా మహామహులెందరో వున్నారు. కీర్తిశేషుల దాశరధి కృష్ణమాచార్యులు గారూ, ఇంకా మనతోవున్న సి నా రె , నేటితరం అశోక్ తేజ, చుక్కా రామయ్య గారు, దెవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, యెవరైనా యెప్పుడైనా పదిమందిలో ఇలా మాట్లాడడం యెక్కడా వినలేదు.మరి వీరిలో ఎవరూ ఆయన్ని ఖండించకపోవడం శోచనీయం. ముంబైలో రాజ్ థాకరే లాగ ఈయనకీ భయపడుతున్నారా? బురదలో కాలెందుకు అని నిర్లక్ష్యం చేస్తున్నారా? తెలుగుతల్లి పాటని అవమాన పరుస్తుంటే తెలంగాణా మేధావులు యేంచేస్తున్నారు? పురుగుల్ని నలిపెయ్యాలని ఎప్పటికి గుర్తిస్తారు?