Monday, July 13, 2009

వాస్తువంకాయ

చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కేంద్రకార్యాలయంలో గేటు తీసేయించి గోడ కట్టిస్తున్నారని వార్తా విశేషం.నిన్న రోజంతా టీవీఛానెళ్ళు ఊదరగొట్టేశాయి.అక్కడ ఉండకూడని దిక్కులో గేటు ఉండడం చాతనే ఆయన దశ బాగాలేదని వాస్తు విజ్ఞానులు నొక్కి వక్కాణించారని ఉవాచ. మరి వారు తొమ్మిది సంవత్సరాలు ఒక వెలుగు వెలిగినప్పుడు ఆ గేటు అక్కడే ఉన్నట్టుందే?తన రాజకీయ చతురతా వ్యక్తిత్వమూ యేవీ పని చెయ్యవా? తమ పార్టీ విధానాలకన్నా జూనియర్ ఎన్ టీ ఆర్ జనాకర్షణ యెక్కువ ప్రభావం చూపుతుందని కూడా నమ్మారు!ఛానెళ్ళ ప్రత్యక్ష ప్రసారాలు ప్రతి వూరిలోనూ ఒకే పాట కంఠతా పెట్టి పాడిన విషయం కళ్ళకి కట్టించాయి. ఏమిటో!

1 comment:

  1. ఒకసారి EVMల మోసం వల్ల పార్టీ ఓడిపోయిందని అన్నాడు. నిజం ఒప్పుకోవడం ఇష్టం లేని వాళ్ళకి వాస్తు కూడా కారణంగా కనిపించడం విచిత్రం కాదు.

    ReplyDelete