Sunday, July 18, 2010

అల్లీబిల్లీలోకం

నిన్నటి పోస్టులో ఆలిస్ గురించి రాశాను.కళ్ళు మూస్తే ఆఠీనురాణీ సయమీస్ కాటూ పిచ్చి కుందేలూ కాకీ అందరూ కనిపిస్తున్నారు.

కలలోబతుకుతున్నామా బతుకులోనే కల గంటున్నామా

Saturday, July 17, 2010

ఆలిస్ ఇన్ వండర్లాండ్

నిన్న ఒకసారి గట్టిగా గిల్లిచూసుకున్నాను-కలా నిజమా అని.చంద్రబాబేమిటి? పరివారసమేతంగా కంచెలు దూకడమేమిటి?వారిని అరెస్టు చేసి కటికనేలపై తిండీతిప్పలూ లేకుండా వుంచడమేమిటి?అది చూసి రోశయ్యగారూ పరివారమూ ముసిముసీనవ్వులు(మనకి తెలీదా ఏమిటి?) నవ్వుకోడమేమిటి?హుందా అనేదేమైంది? నాయుడు అంతగా బాబ్లీ గురించే పోరాడాలంటే ముంబాయి వెళ్ళి వారి సి ఎం తో మాట్లాడలేడా?నాయుడికీ రోశయ్య సర్కారుకీ మహారాష్ట్ర సర్కారుకీ ఇంగితజ్ఞానం పోయిందా లేకపోతే ఇలాంటి కేతిగాళ్ళని నేతలనుకుంటున్న మనకే పోయిందా?

Friday, July 9, 2010

గురివింద

రాజీవ్గ్ గాంధీ అండ లేకుండా వైఎస్ఆర్ అంతవాఢయ్యాడా అని సోనియా వాపోయారట. మరి తమసంగతేమిటో

27 మే నాడు జవహర్ లాలు గారిని తలచిన దాఖలా కనబడలేదే

Sunday, July 4, 2010

హతవిధీ

ఇప్పుడే చూశాను ఒక ఛానెల్ వారు తెలంగాణ పంచాయితీ జరుపుతుంటే గులాబికండువా వారు స్టేజెక్కి గలాభాచేస్తున్నారు.విజయశాంతిగారికి మనుషులని నరికెయ్యడంలో తప్పేమీకనబడలేదట. పైగా కాళోజీ గారన్నమాటే అన్నారట. రేపు మరొకావిడ కంటినీరు చనుకట్టుమీద పడడం చూపించి పోతనగారు చెప్పిందే అంటుందేమో

Tuesday, February 9, 2010

సమర్ధమైన ప్రభుత్వం లేకపోతే ఎన్ని చిక్కులొస్తాయో గత ఆరునెల్లగా ప్రజలకితేటతెల్లమౌతోంది.ప్రజలమధ్యనించి వచ్చే నాయకులు కాకుండా అధిష్ఠానం(ఎవరికి?) కూచోబెట్టిన వాళ్ళు యేలితే కుక్కలు చింపిన విస్తరి అవుతుంది.నేను సొంతంగా యేమీ చెయ్యను పైవాళ్ళెలాచెపితే అది పాటించడమే అన్న ముఖ్యమంత్రిని తెలివితక్కువ వాడనుకోవాలా దగుల్బాజీ అనుకోవాలా? క్షమించాలి కే సి ఆర్ గారి భాష వచ్చేస్తోంది. బయట పడాలంటే మంచిమాటలేమైనా ఆడుకోవాలి.
మొన్నొక రోజు జీటీవీ సరిగమప చూశాను. కోడి రామకృష్ణ అతిధిగా వచ్చేడు. తూర్పు పడమర లోని శివరంజనీ పాటని ఒక కుర్రాడు పాడాక దానిని శివరంజని సినిమాలోదిగా అభివర్ణించి యేవేవో చెప్పాడు. ఆమాటలన్నీ కట్టుకధలే అనుకోవాలా.. శైలజకీ మాధవపెద్ది సురేష్ కీ కూడా తెలీదా లైవ్ ప్రోగ్రాం కాదే సరిదిద్దలేదెందుకని?